యాప్నగరం

మళ్లీ హీట్ ఎక్కిన నంద్యాల రాజకీయం!

మొన్నటి వరకూ ఉప ఎన్నిక వేడితో రాష్ట్రాన్నంతటినీ ఆకర్షించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు..

TNN 13 Dec 2017, 11:54 am
కర్నూలు జిల్లా రాజకీయాలకు రాజధానిగా మారిపోయింది నంద్యాల. మొన్నటి వరకూ ఉప ఎన్నిక వేడితో రాష్ట్రాన్నంతటినీ ఆకర్షించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు.. మళ్లీ ఒక ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో హీట్ ఎక్కుతోంది. ఇది కర్నూలు జిల్లా మొత్తానికి సంబంధించిన పోటీనే అయినా.. నంద్యాల ఉప ఎన్నిక పరిణామాలతో ముడిపడి ఉన్నది కావడం విశేషం. భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక సమయంలో.. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ మారినందుకు గానూ ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
Samayam Telugu heated politics in nandyal again
మళ్లీ హీట్ ఎక్కిన నంద్యాల రాజకీయం!


అవతల తెలుగుదేశం పార్టీ వాళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని వారి చేత రాజీనామా చేయించకుండానే రాజకీయాన్ని కొనసాగిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం..మేము అలా కాదు, అని తెలుగుదేశం నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్సీ చేత రాజీనామా చేయించింది. చక్రపాణి రెడ్డి రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ కు పంపించడం, అది వెంటనే ఆమోదం పొందడం.. చకచకా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఈ సీటుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ నె 19 న నోటిఫికేషన్ విడుదల కానుంది. 26వ తేదీ నుంచి నామినేషన్లు మొదలు. 29న నామినేషన్ల ఉపసంహరణ. 2018 జనవరి 12న ఈ ఎన్నిక పోలింగ్ ఉంటుంది. జనవరి 16వ తేదీన ఈ ఎన్నిక పలితం వెల్లడి కానుంది. ఈ బై పోల్ అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ హీట్ ను మరింత పెంచవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.