యాప్నగరం

వరలక్ష్మీ వ్రతం: తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిట

శ్రవణ శుక్లపక్షం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలోని అమ్మవారి ఆలయాల్లో సాయంత్రం భక్తుల రద్దీ క్రమేనా పెరిగింది.

Samayam Telugu 24 Aug 2018, 5:04 pm
శ్రవణ శుక్లపక్షం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలోని అమ్మవారి ఆలయాల్లో సాయంత్రం భక్తుల రద్దీ క్రమేనా పెరుగుతోంది. ముఖ్యంగా విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో వందలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, కానుకలు సమర్పించారు.
Samayam Telugu Untitleda


పౌర్ణమికి ముందు వస్తున్న శుక్రవారం కావడంతో ఈ శుక్రవారానికి అధిక ప్రాధాన్యం లభించింది. ఈ రోజు వరలక్ష్మీని పూజిస్తే అష్టలక్ష్మీలను పూజించినంత పుణ్యం వస్తుందని, సౌభాగ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిలో కొలువైన అమ్మవారు.. ఈ రోజు వరలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

విశాఖపట్నంలోని బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మీ దేవస్థానంలో సైతం భక్తుల రద్దీ కనిపించింది. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని పూజలర్పించారు. తెలంగాణలోని అమ్మవారి ఆలయాల్లో సైతం రద్దీ నెలకొంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి, ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ తదితర ఆలయాల్లో భక్తులు రద్దీ నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.