యాప్నగరం

ఒంటి మిట్టలో భారీ వర్షం: ముగ్గురు భక్తులు మృతి

ఒంటిమిట్ట శ్రీరామ నవమి వేడుకల్లో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వల్ల వేడుకలను చూడటానికి వచ్చిన ముగ్గురు భక్తులు మృత్యువాత పడ్డారు.

Samayam Telugu 30 Mar 2018, 11:46 pm
ఒంటిమిట్ట శ్రీరామ నవమి వేడుకల్లో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వల్ల వేడుకలను చూడటానికి వచ్చిన ముగ్గురు భక్తులు మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కడప చేరుకున్న సీఎం చంద్రబాబు వర్షం కారణంగా ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో బస చేశారు.
Samayam Telugu ontimitta


విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌‌తో బద్వేలుకు చెందిన చిన్న చెన్నయ్య విద్యుద్ఘాతానికి గురై మరణించాడు. పోరుమామిళ్లకు చెందిన వెంగయ్య తొక్కిసలాటలో మరణించాడు. దక్షిణ గోపురం వద్ద బారికేడ్లు కొయ్యలు పడి వెంకట సుబ్బమ్మ అనే మహిళ మృతిచెందింది. ఆలయానికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్ గాలికి ఎగిరిపడి మరికొందరు గాయపడ్డారు.

కళ్యాణం చూసేందుకు వచ్చిన వేలాది భక్తులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురు గాలుల దాటికి భారీ ఫ్లెక్సీలు, టెంట్లు చెల్లా చెదరయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒంటిమిట్ట ఆలయంలో అంధకారం అలముకుంది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత సీఎం చంద్రబాబు వేడుకలకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.