యాప్నగరం

భాగ్యనగరంలో భారీ వర్షం.. జీహెచ్‌ఎంసీ అప్రమత్తం

సుమారు గంట పాటు ఏకదాటిగా కురిసిన వర్షం. హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం. ట్రాఫిక్ ఇబ్బందులు.

Samayam Telugu 11 Sep 2018, 6:47 pm
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం (సెప్టెంబర్ 11) సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో రహదారులపై వరద నీరు పోతెత్తింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం తలెత్తింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన కూడళ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Samayam Telugu rain


జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్ పేట, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హైదర్‌గూడ, హిమాయత్‌నగర్‌, లక్డీకాపూల్‌, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రజలు తడిసి ముద్దయ్యారు.

భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక బృందాలు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్దీకరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.