యాప్నగరం

భాగ్యనగరంలో భారీ వర్షం.. పాతబస్తీ జలమయం

తార్నాక, ఓయూ క్యాంపస్‌, నాచారం, ఉప్పల్, చార్మినార్, ఎల్బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌, అంబర్‌పేటల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటూ వడగండ్ల వాన కురిసింది.

Samayam Telugu 20 Apr 2019, 5:44 pm

ప్రధానాంశాలు:

  • అకాల వర్షం దెబ్బకు హైదరాబాద్ పాతబస్తీ జలమయం.
    .వర్షపు నీళ్లకు తోడు.. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో నీళ్లు.
    స్థానికులు, వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. మరికొన్ని ప్రాంతాలను చిరుజల్లులు పలకరించాయి. తార్నాక, ఓయూ క్యాంపస్‌, నాచారం, ఉప్పల్, చార్మినార్, ఎల్బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌, అంబర్‌పేటల్లో వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటూ వడగండ్ల వాన కురిసింది.
అకాల వర్షం దెబ్బకు హైదరాబాద్ పాతబస్తీ జలమయమయ్యింది. వర్షపు నీళ్లకు తోడు.. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీళ్లు పారాయి. దీంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. వీకెండ్ కావడంతో రోడ్లపై కాస్త రద్దీ కనిపించింది.. దీనికి తోడు వర్షం దెబ్బకు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనాలను క్రమబద్దీకరించలేక ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలు పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.