యాప్నగరం

గుంటూరును వణికిస్తున్న భారీ వర్షాలు

తెలంగాణాలో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో... ఏపీలో గుంటూరు జిల్లా పరిస్థితి అలాగే ఉంది.

TNN 22 Sep 2016, 10:02 am
తెలంగాణాలో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో... ఏపీలో గుంటూరు జిల్లా పరిస్థితి అలాగే ఉంది. అన్నింటికన్నా ఈ రెండు జిల్లాలే భారీ వర్షాల ధాటికి చిగురులాకులా వణికిపోతున్నాయి. ఏపీలో గుంటూరు జిల్లాలోనే భారీగా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. నరసరావుపేటలో రెండు బస్సులు, ఆటో, కారు వాగులో చిక్కుకున్నాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, పోలీసులు వారిని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గుంటూరు తడిసి ముద్దయిపోయింది. రాజుపాలెం మండలం రెడ్డి గూడెంలో రైల్వే ట్రాక్ మీద భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఫలక్ నుమా, పల్నాడు ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. సికింద్రాబాద్ - గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నరసరావుపేటలోని పలు కాలనీలు నీట మునిగాయి. సత్తెనపల్లిలో వాగులు తీవ్ర స్థాయిలో పొంగిపర్లుతున్నాయి. దీంతో సత్తెనపల్లి నుంచి గుంటూరు, అమరావతి, ఫిరంగిపురం, పిడుగురాళ్లకు రాకపోకలు నిలిచిపోయాయి.
Samayam Telugu heavy rains lashes guntur disrupt life
గుంటూరును వణికిస్తున్న భారీ వర్షాలు


Heavy rains create havoc in Guntur, Throwing life out of gear in the city. Heavy rains caused massive flooding in parts of Guntur. The situation was worsen in some areas of Satthenapally, Piduguralla, Rajupalem, Guntur town, Gurajala. Flood water entered some houses, Residents spent a sleepless night.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.