యాప్నగరం

అల్పపీడనం తీవ్రరూపం: అతిభారీ వర్షాలు

అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

TNN 23 Sep 2016, 2:21 pm
అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావం నేడు, రేపు తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్పింది. అనంతరం మూడు రోజులు పాటూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడం, అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా భారీ వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ లో శుక్రవారం తక్కువ సమయంలో అతి భారీ వర్షం కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం రెండు మూడు గంటల వ్యవధిలోనే 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా జరిగే నగరం అతలకుతలం అయ్యే అవకాశం ఉంది.
Samayam Telugu heavy rains lashes hyderabad
అల్పపీడనం తీవ్రరూపం: అతిభారీ వర్షాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.