యాప్నగరం

ఈ 5 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జర జాగ్రత్త!!

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రానున్న ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు...

TNN 14 Oct 2017, 10:53 pm
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రానున్న ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు. శనివారం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయి. ఇక ఏపీలో దక్షిణ కోస్తాతోపాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది.
Samayam Telugu heavy rains to hit telangana and andhra pradesh in next five days
ఈ 5 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జర జాగ్రత్త!!


సాధారణంగా వర్షాభావ ప్రాంతమైన రాయలసీమలోనూ ఈ వాతావరణ ప్రభావం వుండనుంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తానికి ఇరు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నందున ఆయా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలతో అప్రమత్తంగా వుండాలని సూచించారు. కోస్తా ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.