యాప్నగరం

పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన రాజ్యాంగ విరుద్ధం: హైకోర్టు

పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన రాజ్యాంగ విరుద్ధం. మరో మూడు నెలలు వరకు మాత్రమే ప్రత్యేక అధికారుల పాలనకు అవకాశం. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే..

Samayam Telugu 11 Oct 2018, 12:25 pm
తెలంగాణలోని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ప్రత్యేక అధికారుల్ని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. గురువారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం నుంచి మూడు నెలల వరకు మాత్రమే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలంది.
Samayam Telugu High Court


మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సంబందించిన ఏర్పాట్లను ఆలోపే పూర్తి చేయాలంది. ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది హైకోర్టు. తెలంగాణలో జులై 31తో పంచాయతీల గడువు ముగియగా.. ఆగస్టు 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు.. అధికారుల పాలనను తప్పుబట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.