యాప్నగరం

అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత

అధికార, ప్రతిపక్షాలు మీడియా పాయింట్ వద్ద ఘర్షణకు దిగాయి.

TNN 10 Sep 2016, 10:24 am
ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ఆందోళనతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం అధికార, ప్రతిపక్షాలు మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నాయి. అక్కడ కూడా ఇరు పక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముందుగా తాము మాట్లాడతామంటే, మేం మాట్లాడతామంటూ... అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీప డ్డాయి. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం తోపులాట సంభవించింది. ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో అని భావించి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు పక్షాలను విడదీశారు. వైసీపీ సభ్యులను మీడియా పాయింట్ దగ్గర నుంచి బయటికి పంపే ప్రయత్నం చేశారు. అయినా ఇరుపక్షాలు వెనక్కి తగ్గకుండా మీడియా పాయింట్ వద్దే ఉన్నాయి. వైసీపీ మీడియా పాయింట్ మైకుల ముందు వైసీపీ ఎమ్మెల్యేలు నిలబడగా, వారికీ... మీడియా ఛానళ్ల కెమెరాలకు మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు నిలుచుని నిరసన తెలిపారు. అయినా వైసీపీ ఎమ్యెల్యేలు వెనక్కి తగ్గకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా చేరుకున్నారు.
Samayam Telugu high tension at ap assembly media point
అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.