యాప్నగరం

ఏవోబీలో అడుగడుగునా సోదాలు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఏవోబీలో అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

TNN 2 Feb 2017, 2:18 pm
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఏవోబీలో అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మంగళవారం సాయంత్రం దాటాక బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు దాడికి పాల్పడ్డారు మావోయిస్టులు. ఈ ఘటనలో ఎనిమిది మంది జవాన్లు మరణించగా, 15 మంది దాకా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరణించిన జవానుల మృతదేహాలను పోలీసులు కోరాపుట్ జిల్లాకు తరలించారు. అక్కడ గౌరవ వందనం సమర్పించి బంధువులకు అప్పగించారు. కాగా ఏవోబీలో ఇంకెక్కడైనా బాంబులు ఉన్నాయేమో అని బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అడుగడుగునా పోలీసులు సోదాలు చేస్తున్నారు. చెట్టూ, పుట్టా ఏమీ వదలడం లేదు. అణువణువును జల్లెడపడుతున్నాయి. ఒడిశా,ఏపీ పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడా భద్రతను పెంచారు.
Samayam Telugu homage paid to martyrs killed in maoist attack in aob
ఏవోబీలో అడుగడుగునా సోదాలు


అక్టోబర్ 23న ఏవోబీలోని మల్కాన్ గిరిలో జరిగి ఎన్‌కౌంటర్ కు ప్రతీకార చర్యగానే మావోలు ఈ దాడి చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ ఎన్ కౌంటర్లో 30 మంది మావోయిస్టులను పోలీసులు చంపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.