యాప్నగరం

హోమ్ గార్డుల జీతాలు త్వరలో పెంపు

హోమ్ గార్డుల జీతాల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.

Samayam Telugu 23 Dec 2016, 11:16 am
హోమ్ గార్డుల జీతాల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలోని హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హోమ్ గార్డుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ సభ్యులు జి.కిషన్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ప్రశ్నకు సమాధానంగా నాయిని మాట్లాడుతూ...హోంగార్డుల సంక్షేమానికి పాటు పడుతున్నామని స్పష్టం చేశారు.
Samayam Telugu home gaurds pays in hike soon says ts home minister nayini
హోమ్ గార్డుల జీతాలు త్వరలో పెంపు


హోంగార్డుల జీతభత్యాలు ఎప్పటికప్పుడూ పెంచుతున్నామని తెలిపారు. హోంగార్డులకు జీవిత బీమా ప్రీమియంను కూడా చెల్లిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నామని చెప్పారు. హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తున్నామని తెలిపారు. విధుల్లో హోంగార్డు మరణిస్తే వారి పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉగ్రవాదుల దాడిలో హోంగార్డు మరణిస్తే రూ. 30 లక్షల పరిహారం ఇస్తున్నామని వెల్లడించారు. పోలీసుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.