యాప్నగరం

వరల్డ్ నం.1 ఎయిర్‌పోర్ట్ మనదే!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచంలోనే..

TNN 7 Mar 2017, 12:13 pm
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచంలోనే నాణ్యమైన సేవలు అందిస్తోన్న విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టును ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) గుర్తించింది. 300కి పైగా విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ తొలి స్థానంలో నిలవడం విశేషం. ఏడాదిలో 5-15 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయ కేటగిరీలో 2016కు గానూ ఆర్‌జీఐఏ ఈ అవార్డు సాధించింది. అక్టోబర్‌లో మారిషస్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నారు.
Samayam Telugu hyderabad airport no 1 in the world in service quality survey
వరల్డ్ నం.1 ఎయిర్‌పోర్ట్ మనదే!


2009 నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టు క్రమంగా మెరుగవుతోందని తెలిపింది. ఐదు పాయింట్ల స్కేలుపై 2009లో 4.4 పాయింట్లు సాధించిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ గతేడాది 4.9 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ తొమ్మిదేళ్లుగా సేవలు అందిస్తోంది. గతేడాది ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించిన వారి సంఖ్య 20 శాతం పెరిగింది. ఈ సర్వేలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ రెండో స్థానంలో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.