యాప్నగరం

తెలంగాణకు కొత్త పోలీస్ బాస్

తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త డీజీపీగా..

TNN 10 Nov 2017, 11:12 pm
తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త డీజీపీగా ఎం. మహేందర్ రెడ్డిని నియమించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నెల 12వ తేదీన మహేందర్‌ రెడ్డి రాష్ట్ర డీజీపీగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా వున్న మహేందర్ రెడ్డి స్థానంలో తాత్కాలిక పోలీస్ కమిషనర్‌గా వీవీ శ్రీనివాసరావు నియమితులయ్యారు. అలాగే ఈ నెల 12న పదవీ విరమణ పొందనున్న అనురాగ్ శర్మను ఆ తర్వాత హోంశాఖ సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది.
Samayam Telugu hyderabad cp mahendar reddy is the new dgp of telangana
తెలంగాణకు కొత్త పోలీస్ బాస్


1986 బ్యాచ్‌కు చెందిన ఎం మహేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో 1962 డిసెంబర్ 3న జన్మించారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చదివిన ఆయన అనంతరం ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఇంటెలీజెన్స్ విభాగానికి అధిపతిగా, గ్రేహౌండ్స్ ఐజీగా, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్‌లకి కమిషనర్‌ హోదాల్లోనూ పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.