యాప్నగరం

క్యారమ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హైదరాబాదీ అమ్మాయి

క్యారమ్ ఆటలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుని, నగరానికి గర్వకారణంగా నిలిచారు హైదరాబాదీ అమ్మాయి హుస్నా సమీరా.

TNN 26 Feb 2017, 12:58 pm
క్యారమ్ ఆటలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుని, నగరానికి గర్వకారణంగా నిలిచారు హైదరాబాదీ అమ్మాయి హుస్నా సమీరా. క్యారమ్ మారథాన్‌లో భాగంగా 34 గంటల 45 నిమిషాల 56 సెకన్లపాటు క్యారమ్ ఆడి ప్రపంచరికార్డ్ సొంతం చేసుకున్నారు హుస్నా సమీరా. విజయవాడలోని డీఆర్ఆర్ఎంసీ స్టేడియంలో గతేడాది డిసెంబర్ 26-27న ఈ మారథాన్ జరగగా... తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్‌లో హుస్నా పేరు నమోదు చేసినట్టుగా గిన్నిస్ బుక్ సంస్థ ప్రతినిధుల నుంచి ఆమెకి సర్టిఫికెట్, ప్రశంసా పత్రం అందాయి.
Samayam Telugu hyderabad girl husna sameera sets guinness record for playing carrom for 34 hours
క్యారమ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హైదరాబాదీ అమ్మాయి


గిన్నిస్ బుక్ ప్రతినిథి జయసింహ ఈ క్యారమ్ మారథాన్‌ని సమీక్షిస్తూ, రికార్డ్ చేశారు. నారాయణ్ పరంజ్పే, అతుల్ కరేచా, ప్రకాశ్ కగల్, ప్రమోద్ సేన్‌లపై ఇప్పటివరకు వున్న వరల్డ్ రికార్డ్ కాస్తా తాజాగా హుస్నా సాధించిన రికార్డుతో తుడిచిపెట్టుకుపోయింది. 2005లో 32 గంటల 45 సెకన్లపాటు క్యారమ్ మారథాన్ నిర్వహించడం ద్వారా అప్పట్లో వీళ్లు ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్నారు.

హుస్నా సమీర 10వ తరగతిలో వున్నప్పుడే విశాఖపట్నంలో నిర్వహించిన పోటీల్లో 18 గంటల 18 నిమిషాల 18 సెకన్లపాటు క్యారమ్ ఆడి రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్‌లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 20 గంటల 20 నిమిషాల 20 సెకన్లపాటు క్యారమ్ ఆడి మరో రికార్డ్ కైవసం చేసుకున్నారు. కానీ తాజాగా హుస్నా సాధించిన ప్రపంచ రికార్డ్ మాత్రం ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కేలా చేసింది. క్యారమ్ ప్లేయర్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హుస్నా... క్యారమ్ ఆటనే తన కుటుంబ వారసత్వంగా భావిస్తున్నారు. అందుకోసం తాను తన బాల్యాన్ని సైతం కోల్పోయానని చెబుతోందీ యంగ్ గాళ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.