యాప్నగరం

అంతర్జాతీయ టూరిజం సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యం

78వ స్కాల్ (ఎస్‌కేఏఎల్) అంతర్జాతీయ సదస్సుకు అతిథ్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్‌ పేరు మరోసారి విశ్వవ్యాప్తం కానుంది..

TNN 19 Jul 2017, 7:05 pm
78వ స్కాల్ (ఎస్‌కేఏఎల్) అంతర్జాతీయ సదస్సుకు అతిథ్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్‌ పేరు మరోసారి విశ్వవ్యాప్తం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదొక కీలక మైలురాయిగా నిలిచిపోనుందని, కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి బాగా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ సదస్సును అక్టోబర్ 5 నుంచి 9 వరకు హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్నారు.
Samayam Telugu hyderabad is the proud host of 78th world skal tourism congress
అంతర్జాతీయ టూరిజం సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యం


స్కాల్ అనేది టూరిజానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఓ అత్యున్నత సంస్థ. 1934లో ఏర్పాటు చేసిన ఈ సంస్థలో చాలా మంది టూరిజం ప్రొఫెషనలిస్టులు ఉన్నారు. ట్రావెల్ అండ్ టూరిజానికి సంబంధించిన అన్ని రకాల విభాగాలను అనుసంధానం చేసే ఏకైక వేదిక ‘స్కాల్’ కావడం గమనార్హం. సుమారు 85 దేశాలకు చెందిన 450 నగరాల నుంచి 20 వేల మంది పర్యాటక ప్రేమికులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు.

ఈ ఏడాది స్కాల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చే అంశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలన్నింటికీ దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల టూరిజం శాఖలు, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రులు, అధికారులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్య దేశాల నుంచి సుమారు 1500 మంది అతిథులు పాల్గొంటారని అంచనా.

తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, స్కాల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్రెసిడెంట్ విజయ్ మోహన్ రాజ్.. అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాను కలిసి ఈ సదస్సును విజయవంతం చేయడానికి ఆ దేశ సహకారాన్ని కోరారు. స్కాల్ ఇంటర్నేషనల్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 7న సమావేశం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.