యాప్నగరం

ఫ్లెక్సీలపై కేటీఆర్‌ సీరియస్‌.. సొంత పార్టీ నేతలకు ఫైన్‌

మలక్‌పేటలో నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో దివ్యాంగుల జాతీయ పార్క్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటుపై మండిపడ్డారు.

TNN 5 Jan 2018, 3:47 pm
ఫ్లెక్సీలు ఏర్పాటుపై మంత్రి కేటీఆర్‌ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసారి ఏకంగా సొంత పార్టీకి చెందిన నేతలపైనే ఫైన్ వేయాలంటూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం (జనవరి 5) ఆయన మలక్‌పేటలోని నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో దివ్యాంగుల జాతీయ పార్క్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలుకుతూ స్థానిక కార్పొరేటర్లు, నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Samayam Telugu hyderabad ktr warns trs leaders over welcome flexies
ఫ్లెక్సీలపై కేటీఆర్‌ సీరియస్‌.. సొంత పార్టీ నేతలకు ఫైన్‌


ఫ్లెక్సీలు పెట్టడంపై కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్‌ సునీతా రెడ్డికి రూ. 50 వేలు, నేతలు అస్లాం, నివాస్‌‌కు ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు. ఫ్లెక్సీల నిషేదం ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దంటూ సీఎం కేసీఆర్ కూడా గతంలో పలుమార్లు విజ్ఞ‌ ప్తి చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.