యాప్నగరం

హైదరాబాద్: కూతురిపైనే తండ్రి అఘాయిత్యం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. చిన్నతనం నుంచి నుంచే పాపం ఆమె తన తండ్రి పైశాచికత్వాన్ని భరించింది. కొద్ది రోజులుగా ఆ పశువు నుంచి లైంగిక వేధింపులు ఎక్కువకావడంతో తట్టుకోలేకపోయింది. ఆమె పోలీసుల్ని ఆశ్రయించడంతో.. ఆ మానవ మృగం చేసిన దారుణం బయటపడింది.

Samayam Telugu 28 Jul 2018, 9:12 am
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. చిన్నతనం నుంచి నుంచే పాపం ఆమె తన తండ్రి పైశాచికత్వాన్ని భరించింది. కొద్ది రోజులుగా ఆ పశువు నుంచి లైంగిక వేధింపులు ఎక్కువకావడంతో తట్టుకోలేకపోయింది. ఆమె పోలీసుల్ని ఆశ్రయించడంతో.. ఆ మానవ మృగం చేసిన దారుణం బయటపడింది. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతంలో జరిగింది ఈ దారుణం.
Samayam Telugu Rape


గోల్కొండ సమీపంలోని గుల్షాన్‌ కాలనీకి చెందిన 52ఏళ్ల వ్యక్తి బేల్దారి మేస్త్రిగా పని చేస్తున్నాడు. అతడికి ఓ కూతురు.. ఆమె వయసు 23 ఏళ్లు. ఆమెను చిన్నప్పటి నుంచి అతడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాధితురాలు.. జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయింది. తనలో తానే కుమిలిపోయింది.

ఈ మధ్య నుంచి వేధింపులు పెరగడంతో ఆమె తట్టుకోలేకపోయింది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేసింది. తన చిన్నతనం నుంచి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.