యాప్నగరం

మెట్రో ప్రారంభంపై సమాచారం లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. నవంబర్ 28న ప్రధాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించడానికి పచ్చ జెండా ఊపారని పలు పత్రికల్లో పతాక స్థాయి కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే.. ఇంతవరకూ ప్రధాని కార్యాలయం నుంచి దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏమీ రాలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

TNN 22 Nov 2017, 7:57 pm
హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. నవంబర్ 28న ప్రధాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించడానికి పచ్చ జెండా ఊపారని పలు పత్రికల్లో పతాక స్థాయి కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే.. ఇంతవరకూ ప్రధాని కార్యాలయం నుంచి దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏమీ రాలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎస్పీజీకి వచ్చిన వివరాలతోనే తాము మెట్రో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Samayam Telugu hyderabad metro inauguration yet to confirm by pmo says k t rama rao
మెట్రో ప్రారంభంపై సమాచారం లేదు: కేటీఆర్‌


ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు ఈ నెల 28న ప్రధాని మోదీ భాగ్యనగరానికి విచ్చేస్తున్నారు. ఇదే సమయంలో మెట్రో రైలును ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. అయితే.. మెట్రోరైలు ప్రారంభంపై పీఎంవో నుంచి తమకేమీ సమాచారం లేదని కేటీఆర్‌ తెలపడంతో.. సందిగ్ధత కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.