యాప్నగరం

మెట్రో పరుగుకు లైన్ క్లియర్..

భాగ్యనగరవాసుల కలల ప్రాజెక్టు మెట్రో రైలుకు కీలక అనుమతి లభించింది. మెట్రో ప్రయాణానికి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టి (సీఎంఆర్‌ఎస్‌) పచ్చ జెండా ఊపింది. మెట్టుగూడ - ఎస్‌ఆర్‌ నగర్‌ మార్గంలో 10 కి.మీ. మెట్రో రైలు నడిచేందుకు సీఎంఆర్‌ఎస్‌ ఆమోదం తెలిపింది.

TNN 20 Nov 2017, 10:26 pm
భాగ్యనగరవాసుల కలల ప్రాజెక్టు మెట్రో రైలుకు కీలక అనుమతి లభించింది. మెట్రో ప్రయాణానికి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టి (సీఎంఆర్‌ఎస్‌) పచ్చ జెండా ఊపింది. మెట్టుగూడ - ఎస్‌ఆర్‌ నగర్‌ మార్గంలో 10 కి.మీ. మెట్రో రైలు నడిచేందుకు సీఎంఆర్‌ఎస్‌ ఆమోదం తెలిపింది. నవంబర్ 17, 18, 19 తేదీల్లో ఈ మార్గంలో తనిఖీలు నిర్వహించిన సీఎంఆర్‌ఎస్ అధికారులు ఈ మేరకు క్లియరెన్స్ ఇచ్చారు. 15 అంశాలపై భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి, తనిఖీలు నిర్వహించి అనుమతి మంజూరి చేశారు. దీంతో మెట్రో రైలు ప్రయాణానికి లైన్ క్లియరైంది.
Samayam Telugu hyderabad metro rail gets safety nod from cmrs
మెట్రో పరుగుకు లైన్ క్లియర్..


మొత్తం 30 కి.మీ. మార్గానికి గానూ 20 కి.మీ. మార్గానికి ఇంతకుముందే అనుమతి లభించిన విషయం తెలిసిందే. తాజా క్లియరెన్స్‌తో మెట్రో ప్రారంభంపై సందిగ్ధత వీడింది. నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభం కానుంది. ఆ మధుర క్షణాల కోసం భాగ్యనగరవాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు సీఎంఆర్‌ఎస్ అనుమతి లభించడం పట్ల మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రారంభానికి అంతా సిద్ధమైనట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నాగోల్‌-మియాపూర్‌ మార్గంలో మిగిలి ఉన్న పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేస్తామని మెట్రో రైల్‌ ఎండీ, సీఈవో శివానంద్‌ నింబర్గీ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.