యాప్నగరం

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో యువతికి వేధింపులు

హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో యువతిని వేధించడం కలకలంరేపింది. సికింద్రాబాద్‌కు చెందిన యువతి రసూల్‌పురా వెళ్లేందుకు జేఎన్టీయూ మెట్రో స్టేషన్‌లో రైలెక్కింది. అయితే అమీర్‌పేట ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌లో దిగి రెండో ఫ్లోర్‌లో రైలు మారాల్సి ఉండటంతో... లిఫ్ట్ ఎక్కింది. అక్కడే ఉన్న టికెటింగ్ క్యాష్ మేనేజర్ నితిన్‌రెడ్డి లిఫ్ట్ ఎక్కమని చెప్పాడు. అతడు కూడా ఆమె వెంటే వెళ్లారు. లిఫ్ట్‌లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి... వేధించాడు. ఈ పరిణామంతో షాక్ తిన్న యువతి భయంతో బయటకు పరుగులు తీసింది.

TNN 16 Feb 2018, 11:34 am
హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో యువతిని వేధించడం కలకలంరేపింది. సికింద్రాబాద్‌కు చెందిన యువతి రసూల్‌పురా వెళ్లేందుకు జేఎన్టీయూ మెట్రో స్టేషన్‌లో రైలెక్కింది. అయితే అమీర్‌పేట ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌లో దిగి రెండో ఫ్లోర్‌లో రైలు మారాల్సి ఉండటంతో... లిఫ్ట్ ఎక్కింది. తనకు ఎలా వెళ్లాలో అర్థంకాక... కిందికి దిగింది. అక్కడే ఉన్న సిబ్బందిని ఎటు వెళ్లాలో అడిగింది. అక్కడే ఉన్న టికెటింగ్ క్యాష్ మేనేజర్ నితిన్‌రెడ్డి లిఫ్ట్ ఎక్కమని చెప్పాడు. అతడు కూడా ఆమె వెంటే వెళ్లారు. లిఫ్ట్‌లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి... వేధించాడు. ఈ పరిణామంతో షాక్ తిన్న యువతి భయంతో బయటకు పరుగులు తీసింది.
Samayam Telugu hyderabad metro rail staffer arrested for misbehaving with a woman passenger
అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో యువతికి వేధింపులు


బాధితురాలు వెంటనే ఎస్‌ఆర్‌నగర్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... నితిన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. మెట్రో రైలు ప్రారంభమయ్యాక ఇది రెండో ఘటన. గతంలో కూడా ఓ వ్యక్తి యువతుల ఫోటోలను అసభ్యంగా తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ ఘటన మరువక ముందే మళ్లీ జరగడం కలకలంరేపింది. ఆడవాళ్లకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో... మెట్రో స్టేషన్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. అప్పుడే ఇలాంటి ఘటనకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.