యాప్నగరం

కిలాడీ డాక్టర్: డబ్బుల కోసం భర్తలను మారుస్తూ..

పేరుకి హోమోపతి డాక్టర్. కానీ ఆమె పెద్ద కిలాడీ. ఒకరిని పెళ్లి చేసుకోవడం ఎలాగోలా అతనితో గొడవపడి కేసులు పెట్టడం.

TNN 19 Sep 2017, 10:59 am
పేరుకి హోమోపతి డాక్టర్. కానీ ఆమె పెద్ద కిలాడీ. ఒకరిని పెళ్లి చేసుకోవడం ఎలాగోలా అతనితో గొడవపడి కేసులు పెట్టడం. తరవాత డబ్బు గుంజడం. ఇలా మూడు వివాహాలు చేసుకుంది. ఇద్దరు భర్తల వద్ద గట్టిగానే డబ్బులు గుంజింది. మూడో భర్తను కూడా ఇలానే బురిడీ కొట్టిద్దాం అనుకుంది. కానీ కథ అడ్డంతిరిగి ఆమె మెడకే చుట్టుకుంది. భర్తపై తప్పుడు డౌరీ కేసు పెట్టినందుకు, అతన్ని మోసం చేసినందుకు వనస్థలిపురం పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Samayam Telugu hyderabad police arrest woman for cheating after she files fake dowry case
కిలాడీ డాక్టర్: డబ్బుల కోసం భర్తలను మారుస్తూ..


పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని తార్నాకలో నివాసం ఉంటున్న సరిత(40) హోమియోపతి డాక్టర్. ఈమెకు 2005లో కర్ణాటకలోని హుబ్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్ల తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అతనిపై కేసు పెట్టింది. 2007 అతని వద్ద లక్ష రూపాయలతో పాటు 10 తులాల బంగారం తీసుకుని విడాకులిచ్చేసింది. తరవాత 2011లో హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. నెల రోజులు గడిచిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని కేసు పెట్టింది. అతని వద్ద 2014లో రూ.9లక్షలతో రాజీ కుదుర్చుకుంది.

ఈ క్రమంలో 2015లో పుణెకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. కొన్ని నెలల అనంతరం అతనిపై కూడా 2015లోనే ఓయూ ఠాణాలో వేధింపుల కేసు పెట్టింది. అతని వద్ద నుంచి రూ.80 వేలు లాక్కుంది. ఆ కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా 2015లో వనస్థలిపురం ఎస్.కె.డి.నగర్‌కు చెందిన వెంకట సూర్యప్రకాశ్‌రావు(50)ను మూడో వివాహం చేసుకుంది. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. ఏడాది గడిచిన తర్వాత ఇతనిపై సరూర్‌నగర్‌ ఠాణాలో తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని కేసు పెట్టింది. సూర్యప్రకాశ్‌రావు తన దగ్గర డబ్బులు వసూలు చేయడానికే ఈ విధంగా చేస్తుందని గుర్తించారు. ఆమె గత వివాహ వివరాలు సేకరించారు. వాటి ఆధారంగా వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.