యాప్నగరం

బెంగుళూరు విధ్వంసం: ప్రసారాలపై హైదరాబాద్‌లో ఆంక్షలు

కావేరి సెగతో కర్ణాటకలో చెలరేగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సోమవారం ఒక్కరోజే కేవలం రాష్ట్ర రాజధాని బెంగుళూరులో...

TNN 13 Sep 2016, 10:55 am
కావేరి సెగతో కర్ణాటకలో చెలరేగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సోమవారం ఒక్కరోజే కేవలం రాష్ట్ర రాజధాని బెంగుళూరులోనే దాదాపు 100కిపైగా వాహనాలు కాలిబూడిదయ్యాయి. అందులో ఎక్కువగా తమిళనాడుకి చెందిన ట్రాన్స్‌పోర్టు వాహనాలు వుండగా మిగతావి ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్స్‌కి చెందిన వాహనాలున్నాయి. బెంగుళూరులో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ... ఆందోళనకారులు మాత్రం రోడ్లపైకి వచ్చి వాహనాలు తగలబెడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులకి పాల్పడ్డారు.
Samayam Telugu hyderabad police issues advisory orders to cable tv operators over protests in bangalore
బెంగుళూరు విధ్వంసం: ప్రసారాలపై హైదరాబాద్‌లో ఆంక్షలు


ఇదిలావుంటే, బెంగుళూరులోని కేపీఎన్ డిపోలో గడ్డి వాముల్లా తగలబడుతున్న బస్సుల దృశ్యాలు, నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్న దృశ్యాల్ని సోమవారం నుంచి అన్ని మీడియా ఛానెళ్లు నిరంతర ప్రసారం చేస్తుండటంపై హైదరాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నగరంలో శాంతిభద్రతలు దెబ్బతినడానికి కారణం అయ్యేటటువంటి విధ్వంసకర దృశ్యాల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రసారం చేయకూడదంటూ సిటీలోని కేబుల్ టీవీ నెట్‌వర్క్ ఆపరేటర్స్‌కి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రజల జీవితానికి విఘాతం కలగకుండా వుండేందుకు అభ్యంతరకరమైన విధ్వంసకర దృశ్యాల్ని ప్రసారం చేయకుండా సంయమనం పాటించాల్సిందిగా కోరుతూ సిటీలోని వార్తా సంస్థలని సైతం పోలీసు డిపార్ట్‌మెంట్ కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.