యాప్నగరం

హైదరాబాద్‌లో సహాయక చర్యల్లో బిజీ అయిన ఆర్మీ

హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా వరదలకి గురైన లోతట్టు ప్రాంతాల్లో ఆర్మీ సైనికులు సహాయక చర్యలు చేపట్టారు.

TNN 24 Sep 2016, 8:28 pm
హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా వరదలకి గురైన లోతట్టు ప్రాంతాల్లో ఆర్మీ సైనికులు సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రికే నగరానికి చేరుకున్న ఆర్మీ బృందాలు శనివారం సిటీలోని బేగంపేట, నిజాంపేట, హకీంపేట, ఆల్వాల్ వంటి ప్రాంతాల్లో సహాయకచర్యల్లో నిమగ్నమైనట్టుగా డిఫెన్స్ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
Samayam Telugu hyderabad rains army deployed in rain affected areas while ndrf playing standby mode
హైదరాబాద్‌లో సహాయక చర్యల్లో బిజీ అయిన ఆర్మీ


వరద బాధితుల సహాయార్థం కోసం జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్‌లోనే ఓ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఆర్మీ అధికారులు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) విభాగాలతో కలిసి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తోంది ఈ కంట్రోల్ రూమ్.

ఇదిలావుంటే, ఇప్పటికీ సిటీలోని కొన్ని లోతట్టు ప్రాంతాల వారికి మిగతా వారితో పూర్తిగా సంబంధాలు తెగిపోయే వున్నాయి. జీహెచ్ఎంసీతోపాటు కొన్ని ఎన్జీవో సంస్థలు వరదల కారణంగా ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతాల వారికి ఆహారం సరఫరా చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.