యాప్నగరం

హైదరాబాద్‌లో ఏటా పెరుగుతోన్న ఆ వ్యాధిగ్రస్తులు

భాగర్యనగరంలో పార్కిన్సన్ వ్యాధి బారినపడే వారి సంఖ్య ఏటా పెరుగుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. నగరంలో ఏటా 2 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.

TNN 11 Apr 2017, 12:17 pm
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భాగ్యనగరంలో ఏటా పెరుగుతూ ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్‌లోనే ఏటా కొత్తగా 2000 మంది రోగులు పెరుగుతున్నారని వైద్యులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ప్రతి లక్షమందిలో 160 మంది ఈ వ్యాధి ప్రభావానికి గురవుతున్నారని తేలింది. హైదరాబాద్ నగరంలో ఏటా కనీసం కొత్తగా 2000 కేసులు నమోదవుతున్నట్లు మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ న్యూరోఫిజీషియన్ డాక్టర్ సిమ్నాచల్ మిశ్రా తెలిపారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్కిన్సన్ రోగులు ప్రత్యేక చికిత్స కోసం భాగ్యనగరానికి చేరుకోవడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు.
Samayam Telugu hyderabad sees 2000 new parkinsons disease cases every year
హైదరాబాద్‌లో ఏటా పెరుగుతోన్న ఆ వ్యాధిగ్రస్తులు


ముఖ కవలికల్లో మార్పులు అంటే నవ్వినప్పుడు, కోపం వ్యక్తం చేసినప్పుడు కుడి లేదా ఎడమ వైపునకు పోవడం, చూపు మందగించడం, చేతి రాతలో మార్పులు, చొక్కా గుండీలు, షూ లేస్ కట్టుకోవడంలో ఇబ్బందులు లాంటివి పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు. అలాగే నెమ్మదిగా మాట్లాడటం, నోటి నుంచి చొంగలు కారడం కూడా దీనికి సంకేతమని గ్లోబల్ హాస్పిటల్స్ న్యూరోసర్జన్ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ కోడూరి తెలిపారు.

పార్కిన్సన్ రోగుల్లో 40 శాతం మంది వ్యాకులతతో బాధపడుతుంటే, 30 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నారు. వీరికి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ అండ్ ఫిజికల్ థెరపీ, మంత్రణం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని రోగులకు అందిస్తే సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మొదటి దశలో మెదడులోని డోపమైన్ స్థాయిలను పెంచాలి. అప్పటికీ ఫలితం లేకపోతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేయాలి.... దీని వల్ల మెదడులో నిస్తేజంగా ఉండి పార్కిన్సన్‌కు కారణమైన భాగాలు ఉద్దీపన చెందుతాయని గతంలో గాంధీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగంలో పనిచేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ధార్యవన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.