యాప్నగరం

హైదరాబాద్ థియేటర్స్ కు అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది బిర్యాని దాంతో పాటే ఇక్కడుండే థియేటర్స్.

TNN 7 Jun 2016, 3:33 pm
హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది బిర్యాని దాంతో పాటే ఇక్కడుండే థియేటర్స్. ఇప్పుడు ఈ థియేటర్స్ గురించి ప్రస్తావన ఎందుకంటే.. ఇక్కడున్న వాటికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించడమే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సప్తగిరి 70 ఎంఎం, నారాయణగూడా చౌరస్తాలోని శాంతి 70 ఎంఎం థియేటర్స్ వాటి నిర్మాణ శైలిలోని ప్రత్యేకతతో ప్రపంచ ఖ్యాతి పొందాయి.
Samayam Telugu hyderabad theaters
హైదరాబాద్ థియేటర్స్ కు అంతర్జాతీయ గుర్తింపు

హుబిట్జ్- జోచెలు జర్మనీకి చెందిన జంట ఫొటోగ్రాఫర్లు. వీరు వరల్డ్ మొత్తం సంచరించి అరుదైన కట్టడాల ఫొటోలు తీస్తుంటారు. వారి ఫొటోగ్రాఫిక్ వర్క్స్ కు ఎంతో ఆదరణ ఉంది. దక్షిణ భారత దేశంలో సినిమా హాళ్ల నిర్మాణాలపై హుబిట్జ్- జోచె ఫొటోగ్రాఫిక్ వర్క్ ను సీఎన్ఎన్ తన వెబ్ సైట్ లో ప్రత్యేక కథనంగా ప్రచురించింది. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని అరుదైన నిర్మాణశైలి ఉన్న ఈ సినిమాహాళ్ల ఫొటోలు 2011-2014 మధ్య కాలంలో తీసినవని. ఇవి సంప్రదాయానికి ఆధునికతను జోడించినట్లుగా కనిపిస్తాయని ఫొటోగ్రాఫర్ జోచె అంటున్నారు. ఇందులో మన హైదరాబాద్ కు చెందిన రెండు సినిమాహాల్స్ ఉండడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.