యాప్నగరం

Gokul Chat Bomb Blast: దోషిగా మరో నిందితుడు తారిఖ్ అంజుమ్

హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్‌ జంట పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం సోమవారం మరొకరిని దోషిగా నిర్ధరించింది.

Samayam Telugu 10 Sep 2018, 1:18 pm
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం సోమవారం మరొకరిని దోషిగా నిర్ధరించింది. సోమవారం తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మహ్మద్‌ తారిఖ్‌ అంజుమ్‌ను దోషిగా తేల్చింది. దీన్ని తీవ్రమైన నేరంగానే పరిగణించింది. మరోవైపు కాసేపట్లో దోషులకు శిక్షలను ఖరారు చేయనుంది. బాంబు పేలుళ్ల కేసులో శిక్షలు ఖరారు నేపథ్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ్గకుండా పోలీసులను మొహరించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రియాజ్ భక్తల్, ఇక్బాల్‌ భత్కల్‌, అమీర్‌ రెజాఖాన్‌లు పరారీలో ఉన్నారు
Samayam Telugu జంట పేలుళ్ల కేసు


ఇండియన్ ముజాయిద్దీన్ సంస్థ ఉగ్రవాదులు 2007 ఆగస్టు 25న గోకుల్‌ఛాట్‌, లుంబినీ పార్కుల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలో 44 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 68 మంది గాయపడ్డారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆగస్టు 5నే ఈ కేసులో వాదనలు ముగియడంతో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సెప్టెంబరు 4న తీర్పు వెలువరించారు. ఎనిమిది మంది నిందితుల్లో కేవలం ఇద్దర్ని మాత్రమే దోషులుగా తేల్చింది. లుంబీపార్క్‌ లేజర్ షో వద్ద, దిల్‌సుఖ్‌నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద బాంబులు అమర్చిన అనీక్‌ షఫీఖ్ సయీద్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలను దోషులుగా పరగణించింది. మహ్మద్‌ తారిఖ్‌ అంజుమ్‌ను కూడా దోషిగా పేర్కొవడంతో ముగ్గురికీ శిక్షలు ఖరారు చేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.