యాప్నగరం

పగటి కలలు కనను, దానికో లెక్కుంది

‘‘పార్టీని నేతలు, కార్యకర్తలతో నింపడం, కమిటీలు వేయడం వంటివి పది రోజుల్లో చేసేయగలను.

Samayam Telugu 19 Jan 2017, 8:06 am
‘‘పార్టీని నేతలు, కార్యకర్తలతో నింపడం, కమిటీలు వేయడం వంటివి పది రోజుల్లో చేసేయగలను. కానీ, నాకంటూ స్పష్టమైన ఆలోచనా విధానం, ప్రణాళిక ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఆచితూచి వెళ్తున్నాను. రాత్రికి రాత్రే పార్టీ నిర్మాణం జరిగిపోతుందన్న పగటి కలలు కనను’’ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Samayam Telugu i am not in a day dream mode says pawan kalyan
పగటి కలలు కనను, దానికో లెక్కుంది


పార్టీ స్థాపించిన రెండున్నరేళ్లలోనే ఇప్పుడున్న ఇతర టీడీపీ, వైసీపీ వంటి పార్టీలతో పోటీ పడగలనన్న ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.

తమకు పట్టా భూములతో సమానంగా ప్యాకేజీ, కౌలు ఇవ్వడం లేదని రాజధాని అమరావతి ప్రాంత లంక గ్రామాల రైతులు, తమ భూములు సాగు చేసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్నారని పోలవరం శివారు మూలలంక రైతులు బుధవారం పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడు వినిపించారు. న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రైతులు తరపున పోరాడతానని పవన్ వారికి హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.