యాప్నగరం

దేశ రాజకీయాల్లో మార్పు కోసం ప్రబలమైన చొరవ తీసుకుంటా

భారత రాజకీయాల్లో ప్రబల మార్పులకు సంబంధించిన నేపథ్యంలో త్వరలోనే ప్రారంభం అవుతుంది. ప్రబలమైన మార్పు కోసం గట్టిగా పట్టుబడితే అది దావాగ్నిలా జ్వలిస్తుంది. దేశానికి తెలంగాణ నాయకత్వం వహిస్తే మీరు గర్వించాలి - కేసీఆర్.

TNN 3 Mar 2018, 7:35 pm
దేశ రాజకీయాలు 70 ఏళ్లుగా మూసధోరణిలో వెళ్తున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయ పరివర్తన కోసం ప్రబలమైన చొరవ తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. మూడు నాలుగేళ్లు దేశానికి ఉపయోగపడతా అంటే నేను తప్పకుండా ఉపయోగపడతా అని ఆయన తెలిపారు. భారత రాజకీయాల్లో ప్రబల మార్పులకు సంబంధించిన నేపథ్యంలో త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ప్రజల్లో ముందుగా పరివర్తన రావాలని కేసీఆర్ చెప్పారు. ప్రబల మార్పు కోసం గట్టిగా పట్టుబడితే అది దావాగ్నిలా మారుతుందన్నారు. అవసరమైతే నాయకత్వం వహించడానికైనా సిద్ధమేనన్నారు. దేశానికి తెలంగాణ నాయకత్వం వహిస్తే మీరు గర్వించాలన్నారు.
Samayam Telugu i am ready to take initiave to change in indian politics kcr
దేశ రాజకీయాల్లో మార్పు కోసం ప్రబలమైన చొరవ తీసుకుంటా


కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సుస్థిరంగా ఉన్న 64 ఏళ్లలోనూ ఏం చేశాయని కేసీఆర్ నిలదీశారు. జనాలకు తాగేందుకు నీరెందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లలో చైనా ఎలా మారిందో చూడండంటూ డ్రాగన్‌ అభివృద్ధిని ప్రస్తావించారు. పురోగతిలో ఆ దేశం అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉందన్నారు. విదేశ మారక ద్రవ్య నిల్వల విషయంలో చైనా ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉందన్నారు.

‘మూడో ఫ్రంట్ అని నేను మాట్లాడను. మోదీకి వ్యతిరేకం కాదు. కానీ దేశంలో మార్పు రావాలని కోరుకుంటున్నా. గుణాత్మక మార్పు రావడం లేదు. రైతులకు ఏం చేశారో చెప్పండి. ఓ మంచి పథకాన్ని చూపించండి. కనీస మద్దతు ధరను మరో రూ. 500 పెంచమనండి చూద్దాం’ అంటూ కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు.

‘ఉత్తర చైనాకు దక్షిణ చైనా నుంచి 2400 కి.మీ. దూరం నుంచి 1600 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. బ్రహ్మపుత్ర, గంగా నదుల్లోనే 40 వేల టీఎంసీల నీరుంది. కానీ దేశంలో సరిపడా సాగునీరు, తాగునీరు ఉండదు, ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వాడుకోలేం. 2004లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టినప్పుడు భారత బడ్జెట్ రూ.4 లక్షల కోట్లు. ఇప్పుడు రూ.24 లక్షల కోట్లు. ఏదీ పెద్ద మార్పు’ అని కేసీఆర్ నిలదీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.