యాప్నగరం

జగన్ పై కేసు పెడతా: ఫిరాయింపు ఎమ్మెల్యే

పార్టీ మారినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అనే ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు

TNN 29 Nov 2017, 2:46 pm
నిన్నటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్రంగా ధ్వజమెత్తిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతా అమ్ముడుపోయిన వాళ్లే, చంద్రబాబు వాళ్లందరినీ కొంటున్నారు.. అని మొన్నటి వరకూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన నేపథ్యం ఉన్న ఈశ్వరి ఇప్పుడు తన విషయంలో వస్తున్న మాటలపై మండి పడుతున్నారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని ఈమె హెచ్చరిస్తుండటం గమనార్హం.
Samayam Telugu i will complain against jagan
జగన్ పై కేసు పెడతా: ఫిరాయింపు ఎమ్మెల్యే


ప్రత్యేకించి జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా వర్గంపై గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. తను ముప్పై ఐదు కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని పార్టీ మారినట్టుగా జగన్ పత్రిక, టీవీ చానళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని... ఇది తనను క్షోభకు గురి చేస్తోందని ఆమె అన్నారు. అందుకే జగన్ పై కేసు పెడతాను అని ఈమె ప్రకటించారు.

చంద్రబాబు గిరిజన ప్రాంతాలను చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అని గిడ్డి ఈశ్వరి అన్నారు. గిరిజన ప్రాంతాల డెవలప్ మెంట్ కు బాబు తనకు హామీలు ఇచ్చారని.. అందుకే టీడీపీలో చేరానని ఈమె ప్రకటించుకున్నారు. తెలుగుదేశంలో చేరితే మంత్రి పదవి ఇస్తానన్నారు.. అని తను వ్యాఖ్యానించడానికి సంబంధించిన వీడియో గురించి స్పందించడానికి ఆమె నిరాకరించారు. పార్టీ మారినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అనే ప్రశ్నకూ ఆమె సమాధానం ఇవ్వలేదు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రాజీనామా.. అని ఈశ్వరి అన్నారు. అయితే ఏ పార్టీ అనేది మాత్రం చెప్పలేదు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.