యాప్నగరం

ఉత్తమ్.. గడ్డం అంత వరకూ పెంచుతారా?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో ఉత్తమ్ గడ్డంపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు

TNN 3 Nov 2017, 4:08 pm
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డంపై ఇది వరకే చర్చ జరిగింది. గడ్డం పెంచడం మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే మీడియా దాని గురించి ఆయనతో ఆరా తీసింది. ఆ సందర్భంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ షేవ్ చేసేది లేదని స్పష్టం చేశారు. 2019వరకూ గడ్డం పెంచుతానని ప్రకటించారు. దానిపై తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉత్తమ్ గడ్డం తమకు అడ్డం కాదు అన్నారు. ఆయన గడ్డం పెంచి తమను అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు.
Samayam Telugu i will not shave untill congress come into poweruttam
ఉత్తమ్.. గడ్డం అంత వరకూ పెంచుతారా?


ఆ సంగతలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో ఉత్తమ్ గడ్డంపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతూ.. ‘గడ్డం ఎప్పుడు తీస్తావ్ అన్నా..’ అని సరదాగా ఆరా తీశారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత సమాధానమే ఇచ్చారు. తెలంగాణలో తమ పార్టీ వచ్చాకే గడ్డం తీస్తానని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

దీంతో ఉత్తమ్ ప్రతిన మరోసారి చర్చలోకి వచ్చింది. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైనే సమయం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తమ పార్టీ విజయంతో ముడిపెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి ప్రతినే చేశాడని అనుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.