యాప్నగరం

తాగుబోతులే కార్డులు వాడుతుంటే మీకేమైంది?

‘పెద్దనోట్లు రద్దయినప్పటి నుంచి తాగుబోతులు కార్డులు (డెబిట్, క్రెడిట్ కార్డులు) వాడుతున్నారు.

Samayam Telugu 16 Dec 2016, 11:14 am
‘పెద్దనోట్లు రద్దయినప్పటి నుంచి తాగుబోతులు కార్డులు (డెబిట్, క్రెడిట్ కార్డులు) వాడుతున్నారు. సాయాంత్రానికి తాగకపోతే తాగుబోతు మైండ్ పనిచేయదు. అదే వారికి కిక్ ఇస్తుంది. అందుకే వాళ్లు క్యాష్ లెస్ లావాదేవీలు చేస్తున్నారు’ అని ఏపీ చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో అన్నారు.
Samayam Telugu if a drunkard use cards what happened to you ap cm asks bureaucrats
తాగుబోతులే కార్డులు వాడుతుంటే మీకేమైంది?


నగదు రహిత సోసైటిగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నప్పుడు...మంత్రులు, అధికారులు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25శాతం కూడా క్యాష్ లెస్ చెల్లింపులు జరగడం లేదని ఆయన అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. ‘25శాతం కూడా క్యాష్‌లెస్ చెల్లింపులు జరగడం లేదు. మీరే ఇలా ఉంటే దేశంలో సంస్కరణలు ఎలా ముందుకు వెళ్తాయి? ఇది అసాధ్యం’ అని బాబు మంత్రులు, అధికారులతో అన్నారు.

క్యాష్ లెస్ సోసైటీగా మారడానికి ఇదో పెద్ద ఛాలెంజ్ అని గుర్తుచేసిన బాబు...అధికారుల మైండ్ సెట్‌లో మార్పు రావాలని ఆయన స్పష్టం చేశారు.
నోట్లరద్దు అనంతరం క్యాష్ లెస్ లావాదేవీల చెల్లింపుల కేంద్రానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పడ్డ కమిటీకి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా వ్యవహారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.