యాప్నగరం

Galla Jayadev: ఎన్నికల ముందు టీడీపీకి ఐటీ దాడుల షాక్... ఈసారి గల్లా జయదేవ్‌ వంతు

ఎన్నికల ముందు ఏపీలో ఐటీ దాడులు రాజకీయ కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అకౌంటెంట్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమ పార్టీ నేతలపైనే ఐటీదాడులు జరగడం పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.

Samayam Telugu 10 Apr 2019, 7:42 am
ఎన్నికల వేళ టీడీపీ నేతలు, వారి సంబంధికులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ గుర్రప్ప నాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. జయదేవ్‌ ఎన్నికల ఖర్చుల వివరాలను గుర్రప్పనాయుడు రెగ్యులర్‌గా రిటర్నింగ్ అధికారులకు అందిస్తున్నారు. అయినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Samayam Telugu galla jayadev


ఐటీ దాడులకు నిరసనగా గుంటూరులోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్‌తోపాటు పలువురు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్‌గా చేసుకొని కేంద్రం ఐటీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. ఎన్నికలకు 48 గంటల్లోపు గడువే ఉన్న తరుణంలో ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

గుంటూరు లోక్ సభ స్థానం బరిలో టీడీపీ నుంచి సినీ హీరో మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ బరిలో ఉండగా.. వైసీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి జయదేవ్ పాత స్నేహితుడైన బోనబోయన శ్రీనివాస్ బరిలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.