యాప్నగరం

వీడియో: నీలోఫర్‌లో పసికందు అపహరణ

హైదరాబాద్‌‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో ఓ పసికందు అపహరణకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పేట్ల బురుజులోని ప్రసూతి ఆసుపత్రిలో శుక్రవారం నిర్మల అనే మహిళ మగశిశువుకు జన్మనిచ్చింది. నిర్మల తల్లి కల్పన వద్ద నుంచి.. ఆయాగా పరిచయం చేసుకున్న గుర్తు తెలియని మహిళ ఆ శిశువును అపహరించింది.

TNN 23 Oct 2017, 3:02 pm
హైదరాబాద్‌‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో ఓ పసికందు అపహరణకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పేట్ల బురుజులోని ప్రసూతి ఆసుపత్రిలో శుక్రవారం (అక్టోబర్ 20) నిర్మల అనే మహిళ మగశిశువుకు జన్మనిచ్చింది. నిర్మలకు తోడుగా ఆసుపత్రిలో ఆమె తల్లి కల్పన ఉంటోంది. అయితే.. గుర్తు తెలియని మహిళ కల్పనకు తనను తాను ఆయాగా పరిచయం చేసుకొని రెండు రోజులుగా ఆమె వెంటే ఉంటోంది. శిశువు అస్వస్థతకు గురవడంతో కల్పన ఆదివారం ఉదయం నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఆమె వెంట.. ఆయాగా చెప్పుకున్న మహిళ కూడా నీలోఫర్‌కు వచ్చింది.
Samayam Telugu infant missed from niloufer hospital
వీడియో: నీలోఫర్‌లో పసికందు అపహరణ


నీలోఫర్‌లో పరీక్షల అనంతరం.. కల్పన ఆ శిశువును పేట్ల బురుజు ఆసుపత్రికి తిరిగి తీసుకెళుతుండగా, సదరు మహిళ ఆమెను తప్పుదోవ పట్టించి బిడ్డతో పాటు ఉడాయించింది. శిశువును అపహరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ శిశువు అపహరణకు గురైందని తల్లిదండ్రులు పేట్ల బురుజు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. రోడ్డు బైఠాయించి నిరసన చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.