యాప్నగరం

ప్రేమ పెళ్లి: కుటుంబాన్ని బహిష్కరించిన పెద్దలు!

పక్కపక్కనే నివాసం ఉండే ఓ యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ ఇష్టం కాస్తా ప్రేమకు దారితీయడంతో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.

Samayam Telugu 26 Aug 2018, 10:54 am
పక్కపక్కనే నివాసం ఉండే ఓ యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ ఇష్టం కాస్తా ప్రేమకు దారితీయడంతో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో దైవసన్నిధిలో భార్యభర్తలుగా మారిన ఆనందంతో గ్రామంలో అడుగుపెట్టిన ఆ జంటను గ్రామస్థులు అడ్డుకున్నారు. పంచాయితీ నిర్వహించి వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. గత్యంతరలేక జంటతో సహా వరుడి కుటుంబం గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దారుణమైన ఈ ఘటన విశాఖపట్నం చిల్లా చోడవరం మండలంలో చోటుచేకుంది. చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామానికి అప్పారావు, అతడి భార్య దేముడమ్మలు కొన్నేళ్ల కిందట వలస వచ్చారు. వీరికి గణేశ్ వరప్రసాద్ అనే కుమారుడు ఉన్నారు. అయితే, వరప్రసాద్ తన పక్కింటి అమ్మాయి విస్సారపు రూపను ఇష్టపడ్డాడు. ఇద్దరి మనసులూ కలవడంతో ప్రేమించుకున్నారు. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేమని భావించిన వరప్రసాద్, రూప వారం కిందట ఇంటి నుంచి వెళ్లిపోయారు.
Samayam Telugu ప్రేమ పెళ్లితో గ్రామ బహిష్కరణ


అనంతరం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వివాహం చేసుకుని, శుక్రవారం తిరిగి తమ స్వగ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులంతా ఒకే సామాజిక వర్గం వారు కావడంతో, వరప్రసాద్ కుటుంబం వేరే ప్రాంతం నుంచి రావడంతో రూపను అతడు పెళ్లి చేసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పెద్దలతో పంచాయితీ పెట్టించి, వరప్రసాద్, తండ్రి అప్పారావుపై దౌర్జన్యన్యానికి దిగారు. చివరకు వరప్రసాద్ కుటుంబం గ్రామం విడిచి వెళ్లిపోయింది. దీనిపై మాజీ సర్పంచి మాట్లాడుతూ.. తాము ఆ కుటుంబాన్ని బహిష్కరించలేదని అన్నాడు. పంచాయతీ పెట్టి నిలదీశారు తప్ప వారిపై చేయి చేసుకోలేదని అన్నాడు. వారు ఎక్కడి నుంచో తమ గ్రామానికి వచ్చారని, మళ్లీ వారి సొంతూరుకు వెళ్లిపోయారు తప్ప ఏ ఇతర కారణం లేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.