యాప్నగరం

తెలంగాణ: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి.

TNN 1 Mar 2017, 7:38 am
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ద్వితీయ భాష పరీక్ష జరగనుంది. గురువారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ముగుస్తుంది. విద్యార్థులు సెంటర్లకు ముందే చేరుకోవాలని.. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి పరీక్ష హాలులోపలికి విద్యార్థులను అనుమతిస్తామని చెప్పారు.
Samayam Telugu inter exams starting from today in telangana
తెలంగాణ: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు


తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మొత్తం 1291 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,76,631 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4,75,832 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా, 5,00,799 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.