యాప్నగరం

బాబూ..మీరు మగాడేనా? లేక...: రోజా ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ‘మీరు మగాడా? లేక ఆడంగా?’

Samayam Telugu 11 Feb 2017, 11:46 am
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ‘మీరు మగాడా? లేక ఆడంగా?’ అంటూ పరుష పదజాలాన్ని ప్రయోగించారు.
Samayam Telugu is cbn a man or female mla roja satires
బాబూ..మీరు మగాడేనా? లేక...: రోజా ఫైర్


అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుల్లో పాల్గొనేందుకు విజయవాడ-గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రోజాను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ఆహ్వానం లేదు. సీపీఎం నాయకురాలు బృందాకరత్, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ లను పిలువలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఆయన టీంకు డబ్బా కొట్టేవాళ్లనే పిలిచారు. సీఎం కేసీఆర్ కూతురు, వెంకయ్యనాయుడు కూతురు, చంద్రబాబు నాయుడు కోడళ్లను పిలుచుకొని తమ సొంత ఫంక్షన్ లా మహిళా పార్లమెంటును జరుపుతున్నారు. ప్రభుత్వం రూ.23కోట్లు ఖర్చు చేసి ఇలాగేనా చేసేది. చంద్రబాబు ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్న విధానాలు ఎలాంటివో బయటపడ్తాయనే భయంతోనే నన్ను సదస్సుకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. వీళ్లు మగాళ్లా? లేక ఆడంగులా?’’ అంటూ రోజా ఫైర్ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.