యాప్నగరం

శ్రీవారి చెంత ఇస్రో ప్రత్యేక పూజలు..

పీఎస్‌ఎల్‌వీ-సీ39 వాహకనౌక ద్వారా మరికొద్దిసేపట్లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు తిరుమలలో..

TNN 31 Aug 2017, 2:45 pm
పీఎస్‌ఎల్‌వీ-సీ39 వాహకనౌక ద్వారా మరికొద్దిసేపట్లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ.. ఇస్రో డైరెక్టర్లు దివాకరన్, సేతురామన్, కునుంబు గురువారం (ఆగస్టు 31) ఉదయం తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు.
Samayam Telugu isro directors performed special pujas at tirumala temple
శ్రీవారి చెంత ఇస్రో ప్రత్యేక పూజలు..


అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన చిన్న నమూనా తీసుకొచ్చి శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజ నిర్వహించే సంప్రదాయం గత 20 ఏళ్లుగా కొనసాగుతోంది. దేవుడి ఆశీస్సులు బలంగా ఉంటే.. ప్రయోగాలకు తిరుగుండదని భావించి ఇలా చేస్తున్నారు.

మరోవైపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి సాయంత్రం 7 గంటలకు రాకెట్‌ను ప్రయోగించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ పూర్తవగానే రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.