యాప్నగరం

ఐటీ గ్రిడ్స్ కేసు: సీఈవో అశోక్‌కు హైకోర్టులో ఊరట

ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు హైకోర్టులో ఊరట లభించింది. డేటా చౌర్యం కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో పలు షరతులను విధించింది.

Samayam Telugu 10 Jun 2019, 7:08 pm
పీ ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో ఆ సంస్థ సీఈవో అశోక్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఓటర్ల వ్యక్తిగత వివరాలను తస్కరించారనే కేసులో ఆయనకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సోమవారం (జూన్ 10) ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అదే సమయంలో పలు షరతులు విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ప్రతి రోజూ పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది.
Samayam Telugu IT grids


హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిందని మాదాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ అంశంపై నాడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకున్నాయి.

ఐటీ గ్రిడ్స్‌ కేసు విచారణకు ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అశోక్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన ఇప్పటికే విచారణకు సహకరించడం లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు.

తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని అశోక్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో అశోక్‌కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.