యాప్నగరం

ఏపీకిదో చీకటి రోజు: కేబినెట్ విస్తరణపై జగన్

పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి

Samayam Telugu 2 Apr 2017, 3:00 pm
పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇది రాజ్యాంగానికి, రాష్ట్రానికి తీవ్ర అవమానమని ఆయన అన్నారు.
Samayam Telugu it is a black day for andhra pradesh ys jagan takes on cabinet expansion
ఏపీకిదో చీకటి రోజు: కేబినెట్ విస్తరణపై జగన్


ఆదివారం జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని ఖండిస్తూ జగన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకున్నారని జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవులుకు రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లకుండా నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడం హేయమని జగన్ అన్నారు.

స్పీకర్ అండదండలతో సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘన కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహారిస్తున్నారని, రాజ్యాంగాధిపతిగా ఉండాల్సిన గవర్నర్ దగ్గరుండి రాజ్యాంగ ఉల్లంఘన కార్యక్రమంలో పాల్గొంటున్నారని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.