యాప్నగరం

భారతీయుల మనసు దోచిన ఇవాంక!

సూటిగా, స్పష్టమయ్యే పదజాలంతో.. అర్థవంతమైన విశ్లేషణతో, స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ...

TNN 29 Nov 2017, 8:01 am
సూటిగా, స్పష్టమయ్యే పదజాలంతో.. అర్థవంతమైన విశ్లేషణతో, స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ... ఇదే సమయంలో స్ఫూర్తిమంతంగా సాగింది ఇవాంక ట్రంప్ ప్రసంగం. అంతర్జాతీయ స్థాయిలో అపరిమితమైన క్రేజ్ కలిగిన ఆమె హైదరాబాద్ వస్తుందనే అంశం మూడు నాలుగు నెలలుగా చర్చలో నిలిచింది. ఆమె కోసం చేసిన ఏర్పాట్లు, ఆమె పాల్గొనబోయే సదస్సు, ఆమె ఎక్కడ బస చేస్తుంది, ఎక్కడకు వెళ్తుంది.. ఏం తింటుంది..ఇలా ప్రతీదీ ప్రత్యేకంగానే నిలుస్తూ వచ్చింది. మరి ఇంత హడావుడికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తూ సాగింది.. ఇవాంక ట్రంప్ ప్రసంగం. పారిశ్రామిక వేత్తల సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, ఆయన సలహాదారు.. ప్రసంగం భారతీయుల మదిని దోచింది!
Samayam Telugu ivanka trumps speech at global entrepreneurship summit in hyderabad
భారతీయుల మనసు దోచిన ఇవాంక!


ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ రోజు ప్రపంచానికి భారత్ అవసరం ఎంతుందో... చాటి చెప్పింది ఇవాంక ప్రసంగం. ఇండియా గురించి ఇంకా ఎవరైనా తక్కువ అంచనా వేస్తుంటే.. అది భారతీయులే అయినా, ఒక్కసారి ఇవాంక ప్రసంగం వింటే.. మన పవర్, మన ప్రస్థానం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. స్వతంత్రం సంపాదించుకున్న డెబ్బై సంవత్సరాల్లో భారత్ ఎక్కడి వరకూ వచ్చిందో ఎంత ప్రగతి సాధించిందో చాలా తక్కువ పదాల్లోనే చక్కగా చెప్పారు ఇవాంక. మన గొప్పదనం గురించి, సాధించిన వాటి గురించి మనమే చెప్పుకొంటే బాగుండదు. అది బయటి వాళ్లు చెబితేనే బాగుంటుంది. మరి అలా చెప్పింది అమెరికా అధ్యక్షుడి తనయ, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న మహిళ కావడం... నిజంగా భారతీయులు గర్వించదగిన అంశమే.

‘మార్పు అనే మాటకు భారతీయులు నిర్వచనాన్ని ఇస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఆకాంక్షలను ఎన్నటికీ వదిలిపెట్టకుండా మెరుగైన భవిష్యత్తు కోసం అనునిత్యం శ్రమించే స్వాప్నికులు. గొప్ప ఆవిష్కర్తలు, పారిశ్రామిక వేత్తలు, నేతలు ఉన్నారిక్కడ’ అని కితాబిచ్చారు ఇవాంక. బహుశా ఇది గొప్ప ప్రశంసే అని చెప్పాలి.

కేవలం భారత్ గురించి ప్రశంసించడమే కాదు.. మరింత మార్పు రావాలనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. పారిశ్రామిక విప్లవంలో మహిళలను మరింతగా భాగస్వామ్యం చేయాలని.. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కొత్త హైట్స్‌ను అందుకోగలదని ఆమె వ్యాఖ్యానించారు. సరికొత్త స్ఫూర్తిని పంచుతూ సాగిన ప్రసంగంతో ఇవాంక ట్రంప్ భారతీయుల మదిని దోచారు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.