యాప్నగరం

సీఎం నా ఇగోని హర్ట్ చేశారు.. నా పోస్టుల్లో తప్పులేదు:ఐవైఆర్

​ఫేస్ బుక్ లో తన అకౌంట్ ద్వారా షేర్ అయిన వివాదాస్పద పోస్టులపై స్పందించారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని తనను బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తనను తొలగించడంపై ఐవీఆర్ స్పందించారు. ముందుగా..ఆ ఫేస్ బుక్ పోస్టులను తనే పోస్టు చేశానని, తనే షేర్ చేశానని ఐవైఆర్ స్పష్టం చేయడం గమనార్హం. ప్రతి వ్యక్తికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని.. తనకూ ఆ స్వేచ్ఛ ఉందని, తన అభిప్రాయాలను తను పంచుకున్నానని ఐవైఆర్ వ్యాఖ్యానించారు.

TNN 20 Jun 2017, 3:40 pm
ఫేస్ బుక్ లో తన అకౌంట్ ద్వారా షేర్ అయిన వివాదాస్పద పోస్టులపై స్పందించారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని తనను బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై ఐవీఆర్ స్పందించారు. ముందుగా..ఆ ఫేస్ బుక్ పోస్టులను తనే పోస్టు చేశానని, తనే షేర్ చేశానని ఐవైఆర్ స్పష్టం చేయడం గమనార్హం. ప్రతి వ్యక్తికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని.. తనకూ ఆ స్వేచ్ఛ ఉందని, తన అభిప్రాయాలను తను పంచుకున్నానని ఐవైఆర్ వ్యాఖ్యానించారు.
Samayam Telugu iyr responds on facebook posts
సీఎం నా ఇగోని హర్ట్ చేశారు.. నా పోస్టుల్లో తప్పులేదు:ఐవైఆర్


జేసీ దివాకర్ రెడ్డి వైజాగ్ ఎయిర్ పోర్టు రభస చేయడం గురించి పోస్టుపై తన స్పందనలో తప్పు లేదని ఐవైఆర్ అన్నారు. అలాగే గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వడాన్ని తను ఇప్పుడు కూడా తప్పు పడుతున్నానని అన్నారు. బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా తను ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి ప్రయత్నిస్తే.. బాబు అపాయింట్ మెంట్ తనకు లభించలేదని అన్నారు. ఆరు నెలలు అయినా బాబు అపాయింట్ మెంట్ దొరకలేదు అని, అప్పుడు తన ఇగో హర్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు.

బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తనే అడిగి తీసుకున్నాను అని, అయితే ప్రభుత్వం దాని ఆశయాలను నీరుగార్చిందని అన్నారు. కార్పొరేషన్ లోని సభ్యులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని వ్యాఖ్యానించారు. ఇక తను వైకాపా కార్యకర్తలకే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించాననేది అబద్ధమని అన్నారు. తెలుగుదేశం వాళ్లైన సభ్యులకు తెలియకుండా ఏం జరగదని అన్నారు.

సోషల్ మీడియా యాక్టివిస్టు రవికిరణ్ ఇంటూరిని అరెస్టు చేసినప్పుడు తనకు బాధకలిగిందని.. ఆ సందర్భంలో తను సోషల్ మీడియా ద్వారా స్పందించానని, పలు పోస్టులను షేర్ చేశానని ఐవైఆర్ స్పష్టం చేశారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని, అందుకు తగ్గ అర్థ,అంగ బలం తనకు లేదని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.