యాప్నగరం

600Km దాటి సాగుతున్న జగన్

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 44వ రోజున ప్రారంభం అయ్యింది.

TNN 26 Dec 2017, 11:15 am
ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 44వ రోజున ప్రారంభం అయ్యింది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని గాండ్లపెంట వద్ద జగన్ నేటి ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు బండారుచెట్టు పల్లి వరకూ జగన్ పాదయాత్ర సాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సాయంత్రం ఐదు గంటలకు జగన్ అక్కడకు చేరుకుంటారని వైకాపా పేర్కొంది.
Samayam Telugu jagan crosses 600 km stone in padayatra
600Km దాటి సాగుతున్న జగన్


కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే జగన్ పాదయాత్ర ఆరువందల కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుంది. కడప జిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర ఆరు వందల కిలోమీటర్ల దూరాన్నిపూర్తి చేసుకుని సాగుతోంది.

కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పాదయాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గత ఎన్నికల్లో వైకాపానే విజయం సాధించింది. అయితే.. గెలిచిన అత్తార్ చాంద్ భాషా తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో కదిరి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకుంది వైకాపా. అందుకు తగ్గట్టుగా జనస్పందన బాగా ఉండటంతో వైకాపా ఉత్సాహవంతంగా ఉంది.

అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్రకు కదిరి నియోజకవర్గమే చివరిది. ఈ నియోజకవర్గం దాటేసి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు జగన్ మోహన్ రెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.