యాప్నగరం

అగ్రిగోల్డ్ భూములు ప్రత్తిపాటి కొన్నారు: జగన్

అగ్రిగోల్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు.

TNN 23 Mar 2017, 2:06 pm
అగ్రిగోల్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. తన సతీమణి పేరిట మంత్రి భూములు కొన్నారని ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకున్న మంత్రి ప్రత్తిపాటి.. తాము కొన్న భూములు అగ్రిగోల్డ్‌కు చెందినవి కావన్నారు. తాను అగ్రిగోల్డ్ భూములు కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
Samayam Telugu jagan mohan reddy reacts on agrigold issue in ap assembly
అగ్రిగోల్డ్ భూములు ప్రత్తిపాటి కొన్నారు: జగన్


కాగా, గురువారం శాసనసభలో అగ్రిగోల్డ్ బాధితులపై వాడివేడి చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులను తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. అనంతరం మైక్ అందుకున్న ప్రతిపక్ష నేత జగన్.. చంద్రబాబు ప్రకటనపై అగ్రిగోల్డ్ బాధితులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారని, కానీ ఆయన కనీస మానవత్వం చూపలేదని విమర్శించారు. తాము వాయిదా తీర్మానం పెట్టాకే ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లతో పాటు, బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు.

అగ్రిగోల్డ్ కేసులో అరెస్టుల విషయంలోనూ ప్రభుత్వం పక్షపాతం చూపిందని జగన్ ఆరోపించారు. అగ్రిగోల్డ్ చైర్మన్‌తో పాటు ఆయన సోదరుడిని మాత్రమే అరెస్టు చేసి మిగిలిన వారి జోలికి వెళ్లలేదని మండిపడ్డారు. డైరెక్టర్లలో ఒకరైన సీతారాం అనే వ్యక్తిని అరెస్టు చేయలేదన్నారు. సీఐడీ విచారణ ప్రారంభమయ్యాక కూడా కొంతమంది అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. వీరిలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి కూడా ఉన్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.