యాప్నగరం

రైతులకు జగన్ మరిన్ని హామీలు

ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

TNN 7 Feb 2018, 12:24 pm
ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1,100 కిలోమీటర్లకు చేరువయ్యారు. నెల్లూరు జిల్లా మీదుగా సాగుతున్న జగన్ పాదయాత్ర నేటితో 82వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ రైతాంగానికి పలు హామీలను ఇస్తున్నారు.
Samayam Telugu jagan more promises for farmers
రైతులకు జగన్ మరిన్ని హామీలు


తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను పగటిపూటే ఇస్తామని జగన్ ప్రకటించారు. రైతులకు వడ్డీలేకుండా రుణాలు ఇప్పిస్తామని, ప్రతి ఏడాదీ మే నెలలో రైతులకు పెట్టుబడి నిధి కింద.. 12,500 మొత్తం ఇస్తామని తెలిపారు. దీంతో ఒక ఎకరాలో వ్యవసాయం చేసే రైతుకు 90 శాతం, రెండెకరాల రైతుకు 50 శాతం పెట్టుబడి సమకూరినట్టే అని జగన్ అన్నారు.

నీళ్లు పడక పదే పదే బోర్లు వేసి రైతులు నష్టపోతున్నారని, ఆ పరిస్థితి లేకుండా.. రైతులకు ఉచితంగా బోర్లను వేయించే పథకాన్ని తెస్తామని జగన్ ప్రకటించారు. రైతులకు గిట్టుబాట ధర కల్పిస్తామని.. మూడు వేల కోట్ల రూపాయలతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

రేపు జగన్ పాదయాత్రకు విరామం ఉండబోతోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినందుకు నిరసనగా కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపుకు వైకాపా మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో.. జగన్ పాదయాత్ర కూడా రేపు ఆగిపోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.