యాప్నగరం

వైఎస్ జయంతి.. జగన్ పాదయాత్ర@2,500km

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి నేడు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు,

Samayam Telugu 8 Jul 2018, 10:00 am
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి నేడు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు.
Samayam Telugu jagan_2500


జయంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబీకులు ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులు ఘటించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల, కోడలు భారతి, ఇతర కుటుంబ సభ్యులంతా సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ అభిమానులు ఆయన విగ్రహాలను పూలమాలలతో సత్కరిస్తున్నారు.

మరోవైపు కచ్చితంగా వైఎస్ జయంతి రోజుకు ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2,500 కిలోమీట్ల మైలురాయిని దాటడం గమనార్హం. గత ఏడాదిలో ప్రారంభమైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజాసంకల్పయాత్ర’ ఇప్పుడు పదో జిల్లాలో సాగుతోంది. వైఎస్సార్ కడపతో మొదలుపెట్టి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. ప్రజలు చెప్పుకుంటున్న కష్టాలను వింటూ, వారితో మమేకం అవుతూ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తుందని, అందరి కష్టాలను తీరుస్తుందని, నవరత్నాలతో ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని జగన్ వారికి భరోసా ఇస్తూ వస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం జగన్ పాదయాత్ర సాగుతోంది. రాయవరం మండలం పసలపూడి సమీపంలో జగన్ పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమిస్తుంది.

ఈ నేపథ్యంలో తన తండ్రికి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పాదయాత్రలో 2,500 కిలోమీటర్ల మైలు రాయిని దాటడాన్ని ప్రస్తావిస్తూ జగన్ ఒక ట్వీట్ పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.