యాప్నగరం

బాబు సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర!

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర

TNN 28 Dec 2017, 1:33 pm
ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. గురువారం ఉదయం అనంతపురం జిల్లాను దాటి చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యారు జగన్. అనంతపురం జిల్లాలో కదిరి నియోజకవర్గంతో జగన్ పాదయాత్ర ముగిసింది. చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గంతో మొదలైంది. నేడు పాదయాత్రకు 46వ రోజు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోకి ప్రవేశించడం ద్వారా జగన్ పాదయాత్ర నాలుగో జిల్లాలోకి ఎంటర్ అయ్యారు.
Samayam Telugu jagan padayatra enters into chotoor dist
బాబు సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర!


కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర ముగిసింది ఇప్పటి వరకూ. ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కడప జిల్లాలోని వివిధ నియోజకవర్గాల మీదుగా కర్నూలు జిల్లాలోకి ప్రవేశించి, ఆపై అనంతలోకి వచ్చారు జగన్. ఇప్పుడు అనంతలో యాత్ర పూర్తి చేసుకుని చిత్తూరులోకి వచ్చారు.

ఈ విధంగా రాయలసీమ వ్యాప్తంగా పాదయాత్రను పూర్తి చేయబోతున్నారు. చిత్తూరు జిల్లాలో పలు నియోజకవర్గాల వారీగా జగన్ పాదయాత్ర సాగనుంది. తంబళ్లపల్లెతో మొదలుపెట్టి.. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల మీదుగా జగన్ పాదయాత్ర సాగనుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కావడంతో ఇక్కడ పాదయాత్రను వైసీపీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.