యాప్నగరం

విప్‌కు భయపడి జంప్ జిలానీలు సభకు రాలేదు

ఏపీ అసెంబ్లీలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ గోడదూకిన ఎమ్మెల్యేల అంశాన్ని ప్రస్తావించారు.

TNN 14 Mar 2016, 2:52 pm
హైదరాబాద్: అవిశ్వాసం సమయంలో విప్ జారీ చేస్తామని భయపడి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సభకు రాలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత జగన్ గోడదూకిన ఎమ్మెల్యేల అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేల బండారం బయటపెట్టేందుకే తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల జోక్యం చేసుకొని ప్రజల సమస్యలపై కాకుండా తన వైఖరి నచ్చక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కక్ష సాధించుకునేందుకే అవిశ్వాసం ప్రవేశపెట్టారని జగనే ఒప్పుకున్నారని యనమల కౌంటర్ ఇచ్చారు. దీనికి స్పందించిన జగన్..ఈ ప్రభుత్వం సభలో ప్రతిపక్షం గొంతు వినిపించకుండా చూడాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం సవ్యంగా పనిచేయగల్గుతుందని ..అలాంటిది ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని జగన్ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.