యాప్నగరం

జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వండి: దేవినేని

‘‘ప్రత్యేక హోదాపై జగన్.. బీజేపీ, మోదీని ఎందుకు నిలదీయడం లేదు? అమిత్ షా కనుసన్నల్లో వైసీపీ నడుస్తోందంటూ దేవినేని ఉమా ఫైర్.

Samayam Telugu 30 Apr 2018, 12:51 pm
పీలో ఖాళీగా ఉన్న బీజేపీ అధ్యక్ష పదవిని వైసీపీ అధినేత జగన్ తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి న్యాయం చేయకుండా బీజేపీ చేస్తున్న కుట్రపై సీఎం చంద్రబాబు ధర్మ పోరాటం చేస్తుంటే.. జగన్ మాత్రం వంచన దీక్షతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
Samayam Telugu 29aaaaa


చంద్రబాబుని విమర్శిస్తున్న జగన్.. ప్రత్యేక హోదా గురించి మోదీని, కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో జగన్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని, అమిత్‌షా కనుసన్నల్లో వైసీపీ నడుస్తోందని ఆరోపించారు. అవినీతి ఆరోపణల కేసుల నుంచి బయటపడేందుకు, ఈడీ నుంచి ఆస్తులు విడిపించుకోడానికే బీజేపీ చెప్పినట్లు ఆడుతున్నారని అన్నారు.

నిన్న మొన్నటి వరకు దిల్లీలో హడావుడి చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. అక్కడ గాలి అనుచరులను గెలిపించే పనిలో వైసీపీ నేతలు ఉన్నారన్నారు. ‘‘కర్ణాటకలో బీజేపీకి ప్రచారం చేయడమంటే తెలుగుజాతికి నమ్మక ద్రోహం చేయడం కాదా?’’ అని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.