యాప్నగరం

నంద్యాల బిగ్ ఫైట్: జనసేన మద్దతుపై పవన్ క్లారిటీ

నంద్యాల ఉప ఎన్నికలో జనసేన మద్దతుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

TNN 16 Aug 2017, 4:50 pm
నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని ఈ ఎన్నికల్లో తటస్థంగానే ఉంటున్నట్లు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. నంద్యాలలో ఈనెల 23న జరుగనున్న ఉప ఎన్నికలో జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుందో వివరించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామన్నారు. అప్పటివరకూ జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి జనసేన మద్దతు ఉండదని పవన్‌ అన్నారు.
Samayam Telugu jana sena neutral on nandyal by election says pawan kalyan
నంద్యాల బిగ్ ఫైట్: జనసేన మద్దతుపై పవన్ క్లారిటీ


2019‌ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. ఏపీతోపాటు తెలంగాణలోనూ పోటీ చేస్తామన్నారు. ఇక నంద్యాల ఉపఎన్నికలను అక్కడ ప్రజలు బాగా గమనిస్తున్నారని ఏ అభ్యర్థికి ఓటు వేయాలో వారే నిర్ణయించుకుంటారన్నారు. దీంతో నంద్యాల ఉపఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు తమకే ఉంటుందనే తెలుగుదేశం పార్టీ ప్రచారానికి తెరపడింది.

ఇదిలాఉంటే 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న నంద్యాల ఉపఎన్నిక పోరు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు సాగుతోంది. ప్రచారంలో ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా.. అధికార పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. తాజాగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ పాల్గొని జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేసే అన్ని పనులను అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని.. ప్రజలకు మంచి చేసే పనులపై సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వాన్ని విమర్శించడమే విపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.